విద్యుత్‌ షాక్‌తో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-12-14T00:59:10+05:30 IST

ఓ చర్చిలో డెకరేషన్‌ చేస్తుండగా, ఇంజనీరింగ్‌ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. బందరు మండలం చిన్నాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను బందరు రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి
సాయిప్రసాద్‌ (ఫైల్‌)

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 13 : ఓ చర్చిలో డెకరేషన్‌ చేస్తుండగా, ఇంజనీరింగ్‌ విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. బందరు మండలం చిన్నాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను బందరు రూరల్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ధనేకుల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఫైనలియర్‌ చదువుతున్న చలమల శెట్టి సాయిప్రసాద్‌ (20) సెలవులు ఇవ్వడంతో స్వగ్రామమైన చిన్నాపురం వచ్చాడు. సెమీ క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా చర్చిని అలంకరిస్తుండగా, విద్యుత్‌ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం దక్కలేదు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిప్రసాద్‌ తండ్రి శ్రీనివాసరావు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాదం అలముకుంది.

Updated Date - 2022-12-14T00:59:11+05:30 IST