ఉద్యోగి ఆత్మహత్య ఘటనపై ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2022-10-18T06:38:25+05:30 IST

సుభాష్‌ చంద్రవర్బ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పట్టణ రైతు భరోసా కేంద్ర సిబ్బంది సోమవారం నల్ల బాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు.

ఉద్యోగి ఆత్మహత్య ఘటనపై ఉద్యోగుల నిరసన

ఉద్యోగి ఆత్మహత్య ఘటనపై ఉద్యోగుల నిరసన

మైలవరం, అక్టోబరు 17:  సుభాష్‌ చంద్రవర్బ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పట్టణ రైతు భరోసా కేంద్ర సిబ్బంది సోమవారం నల్ల బాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా, పేట మండలం దొంతమూరు గ్రామ ఉద్యాన సహాయకునిగా పనిచేస్తున్న సుభాష్‌ చంద్రవర్మపై అధికారులు తీవ్ర ఒత్తిడి, టార్గెట్లు ఇచ్చి ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఏపీ రైతు భరోసా కేంద్ర ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు పట్టణ రైతు భరోసా కేంద్ర సిబ్బంది సుభాష్‌ చంద్రవర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు.

Read more