ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-05T06:17:16+05:30 IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆముదాలపల్లి లేఅవుట్‌ను పరిశీలిస్తున్న మండల ప్రత్యేకాధికారి జనార్దన్‌

ఉంగుటూరు, మార్చి 4 : మండలం లోని ఆముదాలపల్లి సచివాలయాన్ని శుక్ర వారం డ్వామా అడిషనల్‌ పీడీ,  మండల ప్రత్యేకాధికారి ఎం.జనార్దన్‌, ఎంపీడీవో కె.జ్యోతి, తహసీల్దార్‌ డి.వనజాక్షితో కలిసి సందర్శించారు. సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్‌ అటెండెన్స్‌ రికార్డులు, రిజిష్టర్లను శాఖల వారీగా తనిఖీచేసి సిబ్బంది, వలం టీర్ల పనితీరును సమీక్షించారు. విధుల నిర్వహణలో అలసత్వం పనికిరాదని, సమ యపాలన పాటిస్తూ కేటాయించిన పనులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎల్లప్పు డూ ప్రజలకు అందుబాటులోవుంటూ సేవల ను అందించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఆర్బీకే, అంగన్‌వాడీ, ఎంపీపీ పాఠశాల, జగనన్నలేఅవుట్లను సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అంగన్‌వాడీ పాఠశాలలో క్రమం తప్పకుండా చిన్నారులకు సమతుల పౌష్ట్టికా హారాన్ని అందజేయాలని, ఓటీఎస్‌ వసూళ్లు వేగవంతం చేయాలని, అభివృద్ధి పరచిన జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్లనిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈవోపీఆర్డీ విజయకుమార్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో అశోక్‌కుమార్‌, జగనన్న క్రాంతిపథం (వెలుగు) ఏపీఎం ఎం.సాంబశివరావు హౌసింగ్‌ ఏఈ ఎం.సురేష్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సత్యశ్రీలేఖ, పంచాయతీ కార్యదర్శి జి. సత్యసాయిబాబు, గ్రేడ్‌-5 కార్యదర్శి బి.అనూష, తదితరులు పాల్గొన్నారు.

కోలవెన్నులో..

కోలవెన్ను (కంకిపాడు) :  అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నెర వేర్చేం దుకు ప్రభుత్వం సంసి ద్ధంగా ఉందని కంకిపాడు మండల ప్రత్యేక అధికారి రజి యా సుల్తాన అన్నారు. మండలంలోని కోలవెన్నులోని జగనన్న గృహ నిర్మాణాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా సుల్తాన మాట్లాడుతూ మండ లంలోని వివిధ గ్రామాల్లో జగనన్న గృహ నిర్మాణాలు వేగంగా జరుగు తున్నాయ న్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్‌, ఇసుక తక్షణం అందజేస్తున్నామ న్నారు. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, ఈవోఆర్డీ దుర్గా ప్రసాద్‌, ఈవో శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:17:16+05:30 IST