18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలి

ABN , First Publish Date - 2022-08-04T06:19:49+05:30 IST

నవరి ఒకటో తేదీ 2023కి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకొని ఓటు హక్కు పొందాలని 81-విజయవాడ తూర్పు నియోజకవర్గం అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారి ఎం.శ్యామల అన్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలి
మాట్లాడుతున్న అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి శ్యామల

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాలి

అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారి ఎం.శ్యామల

చిట్టినగర్‌, ఆగస్టు 3: జనవరి ఒకటో తేదీ 2023కి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకొని ఓటు హక్కు పొందాలని 81-విజయవాడ తూర్పు నియోజకవర్గం  అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ అధికారి  ఎం.శ్యామల అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ కార్యాలయంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ 2023 నాటి 18 ఏళ్లు నిండినవారు, ఓటు హక్కు పొందని వారిని గుర్తించి  ఓటు హక్కు పొందేలా చేయాలన్నారు. చనిపోయిన ఓటర్లను గుర్తించి తీసేయాలన్నారు. కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు, పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పు గురించి తగు సూచనలు చేసి  వాటిపై చర్చించారు. ఓటర్ల నమోదు సంబంధించి ప్రత్యేక క్యాంపైన్‌ డే ఏర్పాటు చేశామని, రెండు శనివారాలు, ఆదివారాలు బూత్‌ లెవల్‌ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేస్తారని, ఆధార్‌తో ఓటర్‌ అనుసంధానం అను ప్రక్రియను ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమం డిసెంబరు 31 వరకు జరుగుతుందన్నారు.

Updated Date - 2022-08-04T06:19:49+05:30 IST