జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపండి : టీడీపీ

ABN , First Publish Date - 2022-12-15T01:59:16+05:30 IST

: రైతులను అన్ని విధాలా దగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపండి : టీడీపీ
చినపాండ్రాకలో కాగిత ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం

మచిలీపట్నం టౌన్‌ : రైతులను అన్ని విధాలా దగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దించాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బందరు మండలం అరిసేపల్లి గ్రా మంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బందరు రూరల్‌ మండల అధ్యక్షుడు కుంచే నాని మా ట్లాడుతూ, రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అమ్మిరెడ్డి శివ, పాండురంగారావు, బసవయ్య, కృష్ణ, ఉపేంద్ర, సముద్రాలు పాల్గొన్నారు. కృత్తి వెన్ను : సీఎం జగన్‌ నవ మోసాలకు పాల్పడుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ విమర్శించారు. చినపాండ్రాకలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిశీలకుడు బోయిన ఏడుకొండలు, పార్టీ మండల అధ్యక్షుడు ఓడుగు తులసీరావు, ప్రధాన కార్యదర్శి పిన్నెంటి రత్తయ్య, నాయకులు నెక్కంటి భాస్కరరావు, బస్వాని బంగార్రాజు, నాగిడి చెన్నకేశవరావు, దాసరి ఆదినారాయణ పాల్గొన్నారు. కోడూరు : ప్రభుత్వ విధానాలపై ప్రతి ఇంటిలో వ్యతిరేకత ఉందని టీడీపీ నాయకులు అన్నారు. ఇరాలి గ్రామంలో బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, కాగిత రామారావు, సుంకర లక్ష్మీ, అద్దంకి పాండురంగారావు, బడే వీరబాబు, బొడ్డు వెంకన్న, గంజాల సుందరరావు, జాన్‌ విల్సన్‌ పాల్గొన్నారు. నాగాయలంక : రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ అన్నారు. ఏటిమొగ గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ నేతలు మెండు లక్ష్మణరావు, సజ్జా గోపాలకృష్ణ, బావిరెడ్డి వెంకటేశ్వరరావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, ఉప్పల ప్రసాద్‌, సైకం అర్జునరావు, గ్రామ పార్టీ నేతలు పాల్గొన్నారు. పామర్రు : జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు ఎంతో విరక్తి చెందారని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా పేర్కొన్నారు. పామర్రులో బుధవారం ఇదేం ఖర్మమన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాలిపర్తి ప్రసాద్‌, సుబ్రమణ్యం, గంటయ్య, చాట్ల రమేష్‌, పామర్తి విజయశేఖర్‌, చింతశ్వరరావు, సందీప్‌, కేదరాశిపల్లి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:59:18+05:30 IST