ఈ-క్రాప్‌తో సంబంధం లేకుండా ధాన్యం కొనాలి

ABN , First Publish Date - 2022-11-19T00:50:06+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక ఈ -క్రాప్‌ నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ప్రతి నిధి బృందం శుక్రవారం చినఓగిరాలలో పర్యటించి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. వరి కోతలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలులో తీవ్రమైన జాప్యం జరుగుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఈ-క్రాప్‌తో సంబంధం లేకుండా ధాన్యం కొనాలి
చినఓగిరాలలో ధాన్యం పరిశీలిస్తున్న నాయకులు

చినఓగిరాలలో ధాన్యం పరిశీలిస్తున్న నాయకులు

చిన ఓగిరాల(ఉయ్యూరు), నవంబరు 18 : రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక ఈ -క్రాప్‌ నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో కౌలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ప్రతి నిధి బృందం శుక్రవారం చినఓగిరాలలో పర్యటించి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. వరి కోతలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలులో తీవ్రమైన జాప్యం జరుగుతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రైతు భరో సా కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి ఎం. యలమందరావు, జమలయ్య, ఎం. అరుణ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకుడు మిక్కిలి నేని రాధాకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:50:07+05:30 IST