నేత్రపర్వంగా ద్వాదశ ప్రదక్షిణలు

ABN , First Publish Date - 2022-03-05T06:00:27+05:30 IST

నేత్రపర్వంగా ద్వాదశ ప్రదక్షిణలు

నేత్రపర్వంగా ద్వాదశ ప్రదక్షిణలు

విజయవాడ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం చుట్టూ శుక్రవారం సాయంత్రం గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పంచ మహావాద్యం, వేదపఠనం, రుద్రసూక్తం, స్తోత్రపఠనం, భేరి, కొమ్ముబూర, కాంస్యనాదం, వీణానాదం, మురళీనాదం, గానం, నృత్యం, మౌనం పేర్లతో 12 సార్లు ఈ ప్రదక్షిణలు జరిగాయి. అనంతరం గంగా సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల పవళింపు సేవ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:00:27+05:30 IST