దీక్షల విరమణ పనులు వేగవంతం
ABN , First Publish Date - 2022-12-07T00:49:07+05:30 IST
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే భవానీ దీక్ష విరమణల ఏర్పాటు పనులను ఇంజనీరింగ్ అధికారులు వేగవంతం చేశారు.
వన్‌టౌన్, డిసెంబరు 6 : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే భవానీ దీక్ష విరమణల ఏర్పాటు పనులను ఇంజనీరింగ్ అధికారులు వేగవంతం చేశారు. కార్పొరేషన్ ఎదురుగా కేశఖండనశాల, సీతమ్మవారి పాదాల ఘాట్, దుర్గా ఘాట్ తదితర ఘాట్ల వద్ద స్నానాలకు షవర్ల ఏర్పాటు, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి కొండపై వరకు క్యూలు, కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్ల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టర్ దిల్లీరావు, పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు అందించారు.
నేడు దుర్గగుడిలో కలశజ్యోతి ఉత్సవం : ఈవో
దుర్గగుడిలో జరగనున్న భవానీదీక్షలు పురస్కరించుకుని మార్గశిర పౌర్ణమి బుధవారం సాయంత్రం 6 గంటలకు కలశజ్యోతి ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ఈవో భ్రమరాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం నుంచి రథోత్సవం సా యంత్రం 6గంటలకు ప్రారంభమై ఊర్వశి సెంటర్, శైలజా థియేటర్, అ లంకార్ సెంటర్, ఏలూరు రోడ్డు, స్వర్ణాప్యాలెస్, మమతా హోటల్, పోలీ స్ కంట్రోల్‌రూం, ఫ్లై ఓవర్, వినాయక గుడి, రథం సెంటర్, కనకదుర్గానగర్, శ్రీమల్లిఖార్జున మహామండపం పక్కన పాతమెట్ల మార్గం మీదు గా కొండపైకి చేరుతుందన్నారు. భవానీలు తీసుకొచ్చే జ్యోతులను కనకదుర్గానగర్‌లో సిబ్బంది తీసుకుంటారని ఈవో తెలిపారు. భవానీలు, భ క్తులు ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.