నాయీ బ్రాహ్మణ కులవృత్తికి అన్యాయం చేయొద్దు

ABN , First Publish Date - 2022-11-09T00:28:43+05:30 IST

నాయీ బ్రాహ్మణుల కులవృత్తిని దెబ్బతీయటానికి కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని, రిలయన్స్‌ ముసుగులో రాష్ట్రంలో సెలూన్‌ పెడతామని ప్రకటించడం దారుణమని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.మారేష్‌ తీవ్రంగా మండిపడ్డారు.

నాయీ బ్రాహ్మణ కులవృత్తికి అన్యాయం చేయొద్దు

నాయీ బ్రాహ్మణ కులవృత్తికి అన్యాయం చేయొద్దు

ఫ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.మారేష్‌

పటమట, నవంబరు 8: నాయీ బ్రాహ్మణుల కులవృత్తిని దెబ్బతీయటానికి కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని, రిలయన్స్‌ ముసుగులో రాష్ట్రంలో సెలూన్‌ పెడతామని ప్రకటించడం దారుణమని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.మారేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. నగరంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ వృత్తిదారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మారేష్‌ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల కుల వృత్తికి ఆటంకం కలిగిస్తూ ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని అడ్టుకుంటామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నాయీ బ్రాహ్మణ సోదరులకు అండగా నిలబడాలని కోరారు. రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల ఎల్లమందరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరు మురళీకృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆకునూరు సుబ్బారావు, నాయీబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు సిహెచ్‌.రాజేశ్వరిపాల్గొన్నారు.

Updated Date - 2022-11-09T00:28:47+05:30 IST