పెన్షన్‌ కోసం దివ్యాంగురాలి నిరసన

ABN , First Publish Date - 2022-08-04T07:02:40+05:30 IST

పెన్షన్‌ కోసం దివ్యాంగురాలి నిరసన

పెన్షన్‌ కోసం దివ్యాంగురాలి నిరసన

కార్పొరేటర్‌ ఇంటి ముందు వీల్‌చైర్‌లో.. ‘నా పెన్షన్‌ దొంగలు’ అని పలకపై నినాదాలు

భవానీపురం, ఆగస్టు 3: 18 ఏళ్ల నుంచి తనకు నెలనెలా వచ్చే పెన్షన్‌ ఎం దుకు నిలిపివేశారంటూ 43వ డివిజన్‌ ఊర్మిళానగర్‌కు చెందిన 36 ఏళ్ల ఇరువూరి ప్రశాంతికుమారి వీల్‌ చైర్‌లో పలక చేతపట్టుకుని కార్పొ రేటర్‌ బాపతి కోటిరెడ్డి ఇంటి వద్ద బుఽధవారం నిర సనకు దిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీల్‌ చైర్‌లో నిరసన తెలిపింది. ప్రశాంతి తల్లి వెంకటనర్సమ్మ తాడేపల్లిలో రాష్ట్ర సిల్క్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అవుట్‌ సోర్సింగ్‌లో అటెండర్‌గా పని చేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మర ణించాడు. ప్రశాంతి అన్నయ్య నర్సారెడ్డి వైసీపీ నాయకుడు. ఆయన కని గిరిలో తన కుటుంబంతో ఉంటున్నాడు. తల్లితో పాటు ప్రశాంతికి ఒకటే తెల్ల రేషన్‌ కార్డు ఉంది. అయితే, తల్లి ఆప్కాస్‌ కింద ప్రభుత్వ ఉద్యోగిగా ఈనెల నుంచి లెక్కలోకి తీసుకోవడంతో ప్రశాంతికి పెన్షన్‌ నిలిపేశారు. గత ంలో కరెంట్‌ బిల్లు ఎక్కువ వచ్చిందని ఆపేస్తే నానా తంటాలు పడి, పెన్షన్‌ తిరిగి సాధించుకుంది. తీరా ఈ నెల ఒకటిన పెన్షన్‌ రాకపోవడం, అనం తరం తొలగించారని తెలుసుకున్న ప్రశాంతి నిరసనకు ఉపక్రమించింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ కోటిరెడ్డి, నాయకులు ఎం.తిరుపతిరావు ఆమెతో మాట్లాడారు. పెన్షన్‌ పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న విజయవాడ జనసేన మైనారిటీ నాయకులు ఐజా గ్రూప్‌ చైర్మన్‌ షేక్‌ గయాజుద్దీన్‌ ప్రశాంతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం పెన్షన్‌ పునరుద్ధరించే వరకు ప్రతినెలా తాను పెన్షన్‌ ఇస్తానని అభయమిచ్చారు.


Updated Date - 2022-08-04T07:02:40+05:30 IST