ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-07-06T07:01:20+05:30 IST

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వెంకట్రావ్‌ అన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వెంకట్రావ్‌

గుడివాడ రూరల్‌, జూలై 5 : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు  ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.వెంకట్రావ్‌ అన్నారు.  గుడివాడ మండల పరిషత్‌ కార్యాలయంలో గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివిధ అంశాలపై జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో బ్యాంక్‌ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.  నిరుద్యోగ యువతకు జనరల్‌ కేటగిరి కింద రూ.25 లక్షలు, బీసీ మహిళలకు రూ.50 లక్షల వరకు, ఎస్సీ, ఎస్టీలకు కోటి రూపాయల వరకు సబ్సిడీ రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్లు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే పన్ను రాయితీలను వివరించారు. ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీడీవో అనగాని వెంకట రమణ, పరిశ్రమల డైరెక్టర్‌ విజయకుమార్‌, ఏజీఎం తెన్నార్స్‌,  చీఫ్‌ మేనేజర్‌ మౌళి, బరోడా బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, వివిధ బ్యాంక్‌ మేనేజర్లు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T07:01:20+05:30 IST