మోసాల మాటున జగన్ పాలన : ఎమ్మెల్యే గద్దె
ABN , First Publish Date - 2022-08-18T06:11:43+05:30 IST
2019 ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో మోసాల మాటున జగన్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.

మోసాల మాటున జగన్ పాలన : ఎమ్మెల్యే గద్దె
పటమట, ఆగస్టు 17 : 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ఓట్లు దండుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో మోసాల మాటున జగన్ పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. బుధవారం ఉదయం అశోక్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో 18వ డివిజన్‌కు చెందిన ముసుగు గురవయ్యకు, 15వ డివిజన్‌కు చెందిన గోనే రాయప్పకు రెండు ట్రై సైకిళ్లను అందజేశారు. లబ్బీపేటకు చెందిన వి.మౌలేశ్వరరెడ్డికి కాలేజీ ఫీజు నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని గద్దె అందజేశారు. గద్దె మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చేందుకు వల్లకాని హామీ ఇచ్చిన జగన్ గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసి ప్రజలను మోసం చేశారన్నారు. దివ్యాంగులను ఆదుకోవాలని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే పెన్షన్ ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్, మంత్రులు చెప్పటం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి ఇస్తున్న పెన్షన్ కూడా వారే ఇస్తున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. పరిపాలన వ్యవస్థను నాశనం చేసి ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో జగన్ పరిపాలిస్తున్నారని, చిత్తశుద్ధి లేని పరిపాలన వలన రాష్ట్ర ప్రజలు, సమాజం పూర్తిగా నష్టపోతుందన్నారు. చిన్నం ఈశ్వరరావు, చలసాని రమణ, పఠాన్ హయత్ ఖాన్, మాదాల చిన్ని, పాల్గొన్నారు.