దొంగ లెక్కలతో జగన్ మాయాజాలం: ఎమ్మెల్యే గద్దె
ABN , First Publish Date - 2022-08-30T06:14:55+05:30 IST
జగన్ మోహన్‌రెడ్డి కేవలం వందలో 30 మందికి మాత్రమే పథకాలు ఇచ్చి సొంత పత్రిక సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగులతో ప్రతి మహిళకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు దొంగ లెక్కలతో మాయాజాలం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.
దొంగ లెక్కలతో జగన్ మాయాజాలం: ఎమ్మెల్యే గద్దె
పటమట, ఆగస్టు 29 : జగన్ మోహన్‌రెడ్డి కేవలం వందలో 30 మందికి మాత్రమే పథకాలు ఇచ్చి సొంత పత్రిక సాక్షిలో పెద్ద పెద్ద హెడ్డింగులతో ప్రతి మహిళకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు దొంగ లెక్కలతో మాయాజాలం చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. సోమవారం అశోక్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ శతజయంతి, నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా 10 మంది పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం గద్దె పది కుట్టు మెషీన్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 30 మందికి పథకాలు ఇచ్చి వంద మంది దగ్గర నుంచి రూ. 500లు వచ్చే కరెంటు బిల్లును రూ. 3 వేలకు పెంచి ఇంటి పన్ను, నిత్యావసర ధరలు పెంచి, చెత్తకు పన్నులు వసూలు చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తం పర్యటన చేసినప్పుడు హరికృష్ణ ఒక్కరే రాష్ట్రం మొత్తం ఒంటి చేత్తో చైతన్య రథాన్ని నడిపారన్నారు. ఆయన ఎంపీగా ఎన్నో సేవలు చేశారని, అటువంటి నాయకుడు లేకపోవడం తీరనిలోటన్నారు. ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, శాయన సత్యనారాయణ, గాబ్రియేలు, గద్దె ప్రసాద్ పాల్గొన్నారు.