-
-
Home » Andhra Pradesh » Krishna » distribution of scholar ships and note books at cvr school-NGTS-AndhraPradesh
-
పేదల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలి
ABN , First Publish Date - 2022-08-31T06:10:12+05:30 IST
పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు.

పేదల విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలి
గవర్నర్‌పేట, ఆగస్టు 30: పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. 23వ డివిజన్ గోపాలరెడ్డి రోడ్డులోని కాజ సుబ్బారావు- మాణిక్యం సత్రం ఆధ్వర్యంలో మంగళవారం సివిల్ కోర్టుల సమీపంలోని సీవీఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహు మతులు, నోట్ పుస్తకాలు పంపిణీ జరిగింది. 2021-22లలో టెన్త్ లో 500 పైబడి మార్కులు సాధించిన సీవీఆర్ పాఠశాల విద్యార్థులు యువీడీ సుధారాణి, పి. సుమంత్‌కుమార్‌లకు ఒక్కొ క్కరికీ రూ. 2,500ల చెక్కులను అందజేశారు. పదో తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులకు రూ. 25,000లు విలువ చేసే లాంగ్ నోట్ బుక్స్‌ను అందించారు. జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె. శాంతి, సత్రం ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య, హెచ్‌ఎం సిహెచ్ సుబ్రహ్మణ్యం, వైసీపీ 23వ డివిజన్ ఇన్‌చార్జి ఆత్మకూరి సుబ్బారావు , నేతలు ఒగ్గు విక్కీ, వడ్డీ శ్రీనివాసరావు, సత్రం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రసాద వితరణ జరిగింది.