ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర

ABN , First Publish Date - 2022-10-05T07:55:13+05:30 IST

ప్రభుత్వ పాలన పేద, బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర

రెడ్డిగూడెం రంగాపురంలో జరిగిన నిరసన దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమా

రంగాపురం(రెడ్డిగూడెం), అక్టోబరు 4: ప్రభుత్వ పాలన పేద, బడుగు, బలహీన వర్గాల పాలిట శాపంగా మారిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రెడ్డిగూడెం ఐటీడీపీ సభ్యులు ఆధ్వర్యంలో మంగళవారం రంగాపురంలో హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిక ఎన్టీఆర్‌ అన్నారు. సీఎం జగన్‌ ఒక పథకం ప్రకారం ప్రజల దృష్టికి మళ్లించేందుకే హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చేందుకు కుట్ర చేశాడన్నారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో టీడీపీని ముందుకు తీసుకువెళితే దానిని చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు  హయాంలో రైతులుకు 24గంటల విద్యుత్‌ ఇవ్వటం జరిగిందన్నారు. అధికారం లేకపోయినా టీడీపీ కార్యకర్తలు గుండె ధైర్యంతో పోరాడుతున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడి తగ్గేదేలా అన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ తెల్లచొక్కా వేసుకుని వచ్చా ఆగర్భశ్రీమంతుడని అని చెప్పి నేడు ఎన్టీటీపీఎస్‌ బూడిద, అక్రమ గ్రావెల్‌ దోపిడీ, బార్లలలో కమీషన్లు, ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు దోపిడీ, ఇపుడు కొత్తగా బామ్మర్దితో ఇబ్రహీంపట్నం పల్లె కారులను బెదిరించి ఇసుక దోపిడీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. మంగళగిరిలో రూ.1500కోట్లతో ఆసుపత్రి పెట్టి రెండు వేల మంది రోగులకు ప్రతి రోజూ వైద్యం అందిస్తున్న డాక్టర్లకు మంచినీరు సరఫరా చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రెడ్డిగూడెంలో ధాన్యం అమ్ముకున్న రైతుల నుంచి కూడా కమిషన్‌ వసూలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఐటీడీపీ కోర్డినేటర్‌ పరసా కిరణ్‌, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Read more