ప్రజలకు వాస్తవాలు చెప్పండి

ABN , First Publish Date - 2022-03-05T06:11:47+05:30 IST

ప్రజలకు వాస్తవాలు చెప్పండి

ప్రజలకు వాస్తవాలు చెప్పండి
గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఐ-టీడీపీ నేతలతో మాట్లాడుతున్న దేవినేని ఉమా

గొల్లపూడి, మార్చి 4: ప్రజలకు వాస్తవాలు చేరవేసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని ఐ-టీడీపీ నేతలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. గొల్లపూడి పార్టీ కార్యాల యంలో శుక్రవారం మైలవరం నియోజకవర్గ ఐ-టీడీపీ కుటుంబసభ్యులు ఆయనతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను వెలుగులోకి తేవాలని సూచించారు. అక్రమ కేసులకు భయపడకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు. రాజధానిపై హైకోర్టు తీర్పుతో ఐదు కోట్ల ఆంధ్రులు పండగ చేసుకుంటున్నారని, సీఎం జగన్‌ అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఉమా అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఐ-టీడీపీ కో-ఆర్డినేటర్లు పరస కిరణ్‌కుమార్‌, ఇరుగులపాటి దిలీప్‌కుమార్‌, నంబూరి శ్యామ్‌ప్రసాద్‌, చావా కిరణ్‌, నక్కనబోయిన దుర్గా జగదీష్‌, జుంజునూరి రాజ, కరెడ్ల ఆంజనేయులు, మూరకొండ నాగేశ్వరరావు, వెలగ రాజు పాల్గొన్నారు. 


Read more