Devineni Uma tweet: ఏపీలో మద్యం తయారీ, సరఫరా అంతా అస్మదీయులే..

ABN , First Publish Date - 2022-10-01T17:42:30+05:30 IST

మద్యం షాపులన్నీ వైసీపీ ప్రభుత్వమే కొనసాగిస్తోందని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

Devineni Uma tweet: ఏపీలో మద్యం తయారీ, సరఫరా అంతా అస్మదీయులే..

అమరావతి (Amaravathi): మద్యం షాపులన్నీ వైసీపీ ప్రభుత్వమే (YCP Govt.) కొనసాగిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma Tweet) ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అదనంగా లిక్కర్ లే అవుట్లు, వాక్ ఇన్ స్టోర్లు... వైసీపీ నేతల జేబులు నింపేందుకే అదనపు అనుమతులు ఇచ్చానని.. ఈ క్రమంలో సొమ్ములు భారీగా చేతులు మారాయని విమర్శించారు. మద్యం తయారీ, సరఫరా అంతా అస్మదీయులే చేస్తున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం ఫణంగా పెట్టిన సీఎం జగన్.. మద్య నిషేధాన్ని అటకెక్కించారని దేవినేని ఉమ విమర్శిస్తూ.. ట్వీట్ చేశారు.

Read more