పోలవరం పూర్తి చేయలేని దద్దమ్మ జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-12-10T01:14:16+05:30 IST

పోలవరం పూర్తి చే యలేని, చేతగాని దద్దమ్మ సీఎం జగన్‌రెడ్డి అని జలవనరులశాఖ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

పోలవరం పూర్తి చేయలేని దద్దమ్మ జగన్‌రెడ్డి

వన్‌టౌన్‌, డిసెంబరు 9 : పోలవరం పూర్తి చే యలేని, చేతగాని దద్దమ్మ సీఎం జగన్‌రెడ్డి అని జలవనరులశాఖ మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ యన జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి కే రెండేళ్లు వాయిదా వేసిన జగన్‌రెడ్డి పోలవరాన్ని 2024కు గానీ పూర్తి చేయలేమని కేంద్రానికి లేఖ రాశాడన్నారు. 30 మంది ఎంపీలున్నా రూ.55,548 కోట్లకు సవరించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను ఆమోదించుకోలేని అసమర్ధుడు జగన్‌ అన్నారు. కేసీఆర్‌ చె ప్పాడని పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనపుడే జగన్‌ రంగు బయటపడిందన్నారు. 2024 జూన్‌ నాటి కి కూడా పోలవరాన్ని పూర్తి చేయలేమని చెప్పడంపై తాము అభ్యంతరం చెబుతున్నామన్నారు. ఈ మేరకు జగన్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు పూర్తిచేస్తే డయాఫ్రమ్‌ వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ ప నులను వేగవంతం చేస్తామని అధికారులు చెప్పినా జగన్‌ వినలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు వ చ్చి చెప్పేవరకు డయాఫ్రమ్‌ వాల్‌కు జరిగిన నష్టాన్ని ఇక్కడి యంత్రాంగం గుర్తించలేకపోయిందన్నారు. సెం ట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డ్యామ్‌ ఎత్తును నిర్ణయిస్తే దా న్ని గాలికొదిలేశారన్నారు. దానివల్లే 2020ఓ వరద రా వడంతో అప్పర్‌ కాపర్‌ డ్యామ్‌, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ లో 2 నుంచి 3 టీఎంసీల నీరు నిలిచిపోయిందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బుద్ధిలేని మంత్రులు బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఒకడు బుల్లెట్లు దింపుతామ ని పత్తా లేకుండా పోయాడన్నారు. సంబరాల అంబటి రాంబాబు ఏమో తలా తోకాలేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. పోలవరం పూర్తయితే యూ నిట్‌ రూ.20కు విద్యుత్‌ కొనుగోలుచేసే ఖర్మ ఉండేది కాదంటూ 2021 నాటికి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా కాం ట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంటే జగన్‌రెడ్డి తన సొంత పవర్‌ ప్రాజెక్టులకు, బినామీలకు మేలు చేయడానికి స దరు ఏజెన్సీని రాష్ట్రం నుంచి తరిమేశాడన్నారు. చంద్రబాబు హయాంలో 72 శాతం మేరకు పనులు పూర్తయిన ప్రాజెక్టును ధన దాహంతో పడుకోబెట్టాడన్నారు. పోలవరాన్ని పూర్తిచేసేది చంద్రబాబేనన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - 2022-12-10T01:14:17+05:30 IST