విధ్వంసాలే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-25T05:59:12+05:30 IST

అభివృద్ధి, ప్రజాసంక్షేమం కంటే విధ్వంసాలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉందని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ విమర్శించారు.

విధ్వంసాలే ప్రభుత్వ లక్ష్యం
తిరువూరులో పాలాభిషేకం చేస్తున్న దేవదత్‌

తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌

తిరువూరు, సెప్టెంబరు 24: అభివృద్ధి, ప్రజాసంక్షేమం కంటే విధ్వంసాలు సృష్టించడమే  వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉందని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ విమర్శించారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ అధ్వర్యంలో జైభావి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.  పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌ ఆధ్వర్యంలో  కందిమళ్ళ శేషగిరిరావు, సింధు శ్రీను, ఆకుల దుర్గాప్రసాద్‌, టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌, వాసం మునియ్య, పర్వతం శ్రీనివాసరావు, పంది శ్రీను, మార్కెండేశ్వరరావు, సోమవరపు శ్రీనివాసరావు, బల్లిపోగు శ్యామ్‌, పాల్గొన్నారు.


విస్సన్నపేటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం 

విస్సన్నపేట: హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై విస్సన్నపేటలో శనివారం పట్టణ అధ్యక్షుడు ఆకుల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర నాయకులు నెక్కళపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. కార్యక్రమంలో షేక్‌ అమానుల్లా, నాదెళ్ల నాగమణి, వడ్లమూడి చంటి, సాంబశివరావు, నాదెళ్ల సత్యనారాయణ, అనసాని లాలయ్య, పల్లెపాం రాంబాబు, మేడా రాజశేఖర్‌, మేసపాం సుధాకర్‌, కోలేటి రంగారావు, వాస గిరిరెడ్డి, కోవ నారాయణ పాల్గొన్నారు. 

Read more