విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-12-16T00:07:00+05:30 IST
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటనపై నున్న రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
విజయవాడ రూరల్, డిసెంబరు 15 : విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటనపై నున్న రూరల్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం అర్జవుల్ హక్(20) పశ్చిమ బంగ్లా నుంచి విద్యుత్ టవర్ల పని కొసం నున్న గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం నున్నలోని ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన ఎన్టీపీసీలో పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురవడంతో తొటి కార్మికులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నున్న రూరల్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.