ఉరివేసుకుని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-16T00:08:06+05:30 IST

సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన న్యూ రాజరాజేశ్వరిపేటలో గురువారం చోటు చేసుకుంది.

ఉరివేసుకుని  వ్యక్తి మృతి

అజిత్‌సింగ్‌నగర్‌, డిసెంబరు 15 : సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన న్యూ రాజరాజేశ్వరిపేటలో గురువారం చోటు చేసుకుంది. కనకదుర్గానగర్‌ ప్రాంతానికి చెందిన అర్జా సాయిచంద్‌ (27) సీసీ కెమెరాల పనిచేసి జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు. బుధవారం సాయిచంద్‌ భార్య ఇద్దరి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తిరిగి గురువారం ఉదయం వచ్చి తలుపు కొట్టగా ఎంత సేపటికీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచిచూడగా భర్త ఉరివేసుకుని కనిపించాడు. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలి వెళ్లి చూడగా అప్పటికే సాయిచంద్‌ చనిపోయాడు. సమాచారం అందుకున్న అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T00:08:07+05:30 IST