దండిగా దసరా మామూళ్ల వసూలు!

ABN , First Publish Date - 2022-09-21T06:24:01+05:30 IST

దస రా వచ్చిందంటే చాలు మామూళ్ల దందా ఆరంభమవుతోంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది విద్యాసంస్థ ల్లో మామూళ్ల కలెక్షన్‌ జరుగుతుండటం గమనార్హం.

దండిగా దసరా మామూళ్ల వసూలు!

విద్యాశాఖ అధికారి సమక్షంలో వేలంపాట 

ప్రైవేటే కాదు ప్రభుత్వ, ఎయిడె డ్‌ స్కూల్స్‌లోనూ దందా..!

విజయవాడ రూరల్‌, సెప్టెంబరు 19 : దస రా వచ్చిందంటే చాలు మామూళ్ల దందా ఆరంభమవుతోంది. గతానికి భిన్నంగా ఈ ఏడాది విద్యాసంస్థ ల్లో మామూళ్ల కలెక్షన్‌ జరుగుతుండటం గమనార్హం. జిల్లాలో విద్యాశాఖలో ఒక అధికారి వద్ద పనిచేసే ఉద్యోగి దసరా ‘హర్‌ స్కూల్‌ కా కలెక్షన్‌’ను ప్రారంభించారు. ఇందుకోసం ఆ ఉద్యోగి ఏకంగా విద్యాశాఖ కు చెందిన ఒక ఉన్నతాధికారి సమక్షంలోనే వసూళ్ల కోసం వేలం పాట పాడుకున్నట్టు తెలిసింది. విద్యాశాఖలో ఒక డివిజన్‌కు చెందిన ఆ ఉద్యోగి జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థలే కాదు ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోనూ దందా ప్రారంభించారు. ఏకం గా పుస్తకం పట్టుకుని నగరంలోని అన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లతోపాటు ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. రూరల్‌, ఇబ్రహీంపటం్న తదితర మండలాల్లో దందాను జోరుగా నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారి ఆశీస్సులుండటంతో విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు చేసేదేమీలేక మామూళ్లను సమర్పించుకుంటున్నారు. దీ నిపై ప్రశ్నించేందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు భయపడుతున్నారని తెలుస్తోంది. ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే కాక పొరుగున కృ ష్ణాజిల్లాలోని పెనమలూరు మండలంలోని పలు స్కూళ్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తె లుస్తోంది. సదరు ఉద్యోగి విధులకు హాజరుకాకుండా వసూళ్లకు వెళుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంఐ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకుంటే, ఇతర శాఖలకు దందా విస్తరించే ప్రమాదం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-21T06:24:01+05:30 IST