సీఆర్‌డీఏ చట్ట సవరణలు వద్దు

ABN , First Publish Date - 2022-10-27T00:55:16+05:30 IST

చట్టసవరణలకు పూనుకోవద్దని అమరావతి రైతులు పలువురు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంత రైతులు రాజేంద్ర, రాంబాబు, పూర్ణ చంద్రరావు, రమేష్‌, సుధాకర్‌లు బుధవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్‌ను కలిశారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఎవరికైనా ఇళ్ళ స్థలాలు కేటాయించే విధంగా తీసుకు రావాలనుకుంటున్న సవరణలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని పేర్కొన్నారు.

సీఆర్‌డీఏ చట్ట సవరణలు వద్దు
సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి చట్ట సవరణకు పూనుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్న అమరావతి రైతులు

విజయవాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : చట్టసవరణలకు పూనుకోవద్దని అమరావతి రైతులు పలువురు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అమరావతి ప్రాంత రైతులు రాజేంద్ర, రాంబాబు, పూర్ణ చంద్రరావు, రమేష్‌, సుధాకర్‌లు బుధవారం సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్‌ను కలిశారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఎవరికైనా ఇళ్ళ స్థలాలు కేటాయించే విధంగా తీసుకు రావాలనుకుంటున్న సవరణలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చట్టసవరణలకు పాల్పడటం అన్యాయమన్నారు. భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఒప్పందానికి అనుగుణంగా అన్నీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులతో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో, సీఆర్‌డీఏ చట్టం మార్చాలన్నా, మాస్టర్‌ ప్లాన్‌కు సవరణలు చేయాలన్నా తప్పనిసరిగా తమ అంగీకారం లేకుండా చేయకూడదని తెలిపారు. అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులకు కౌలు రావటం లేదని ఈ సందర్భంగా తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని సీఆర్‌డీఏ కమిషనర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2022-10-27T00:55:18+05:30 IST