మతోన్మాద బీజేపీ దేశానికి ప్రమాదకరం
ABN , First Publish Date - 2022-06-25T06:29:20+05:30 IST
మతోన్మాద బీజేపీ దేశానికి ప్రమాదకరమని, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలనే కుట్ర పన్నుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు.

కృష్ణాజిల్లా సీపీఐ 25వ మహాసభల్లో రామకృష్ణ
మచిలీపట్నం టౌన్, జూన్ 24 : మతోన్మాద బీజేపీ దేశానికి ప్రమాదకరమని, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలనే కుట్ర పన్నుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. కృష్ణాజిల్లా సీపీఐ 25వ మహాసభలు మచిలీపట్నంలోని సప్తగిరి ఫంక్షన్ హాలు మోదుమూడి శ్రీహరిరావు సభా వేదికపై శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా రామకృష్ణ హాజరై ప్రసంగిస్తూ మోదీ ప్రభుత్వం ఆర్‌ఎ్‌సఎస్ ఎజెండాను అమలు చేస్తోందని, ప్రజలు అప్రమత్తమై సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి హక్కుల ఉల్లంఘన పాల్పడుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వైసీపీ ఆధ్వర్యంలోని జగన్ ప్రభుత్వం శా డిజంతో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కు ప్పలా మార్చిందన్నారు. మూడు రాజధానులపేరుతో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారన్నారు. తొలుత సీపీఐ పతాకాన్ని సీనియర్ నాయకురాలు దేవభక్తుని నిర్మల ఆవిష్కరించారు. మృ తవీరుల స్థూపాన్ని సీపీఐ నేత పేరిశెట్టి ఉమాకాంతం ఆవిష్కరించారు. కార్యదర్శి నివేదికను ఉమ్మడి కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ ప్రవేశ పెట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మోదుమూడి రామారావు మాట్లాడుతూ కృష్ణాజిల్లా భూపోరాట, వామపక్ష ఉద్యమాలకు కేంద్ర బిందువని, మ చిలీపట్నంలో బెల్ కంపెనీ ఏర్పాటులో చండ్ర రాజేశ్వరరావు పోరాటం స్ఫూర్తిదాయకమన్నా రు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అడ్డాడ ప్రసాదబాబు, తూము కృష్ణయ్య, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, జిల్లా కార్యవర్గ స భ్యుడు విజయకుమార్, లింగం ఫిలిప్, మో దుమూడి నాగరాజు, కట్టా హేమసుందరరా వు, కరపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. సీపీఐ జాతీయ మహాసభలకు మోదుమూడి రామారావు సతీమణి మోదుమూడి అరుణకుమారి రూ.50వేలు, సీపీఐ బందరు నియోజకవర్గ కమిటీ రూ.30వేలు విరాళంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు అందచేశారు.