చెస్‌తో లక్ష్యసాధనలో ముందడగు

ABN , First Publish Date - 2022-11-21T01:14:28+05:30 IST

చెస్‌ అభ్యసన, వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా వి ద్యార్థి దశ నుం చి లక్ష్యసాధన లో ముందడగు వేయవచ్చని నగర పోలీస్‌ కమిషనర్‌ టి. కాంతిరాణా అ న్నారు.

చెస్‌తో లక్ష్యసాధనలో ముందడగు

విజయవాడ స్పోర్ట్సు, నవంబరు 20 : చెస్‌ అభ్యసన, వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా వి ద్యార్థి దశ నుం చి లక్ష్యసాధన లో ముందడగు వేయవచ్చని నగర పోలీస్‌ కమిషనర్‌ టి. కాంతిరాణా అ న్నారు. ఏలూరు రోడ్డులోని సీతారామపురంలోని ఐకాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో గ్లోబల్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో సాంబమూర్తి మొమోరియల్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ విజేతల బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. ఐకాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వై.పార్థసారథి, చైర్మన్‌ కె.రాజేంద్ర, టోర్నీ ఆర్గనైజర్‌ షేక్‌ ఖాసీమ్‌ పాల్గొన్నారు.

విజేతలు వీరే... 7 రౌండ్ల పోరులో మొత్తం 270 మంది క్రీడాకారు లు బరిలో దిగారు. ఫైనల్‌ ర్యాంకింగ్‌ రౌండ్స్‌లో శివ పవన్‌తేజ శర్మ, కె. వెంకట కృష్ణ కార్తీక్‌, అల్లూరి భాస్కర రత్న షణ్ముకరెడ్డి తొలి మూడు స్థానాలు సాధించారు. బాలికల్లో అండర్‌-8లో యక్కల గుణశ్రీ, కొల్లా చార్విశ్రీ, కావ్య, అండర్‌-10లో చెరువు లౌఖ్య సాధిక, పి.బబ్లీ బాల, డి.సోనిక, అండర్‌-12లో జె.నందిక, పి.సుచిత్ర క్రిస్టీ, వై.శరణ్య, అండర్‌-14లో జులేఖ బహార్‌, ఎస్‌.విష్ణు ప్రియ, ఎ.మోక్షశ్రీ, అండర్‌-16లో వై.నిశ్చల, డి. ఈశ్వరి, బి.ఆండ్రేయ సావియో వరుసగా తొలి మూడు స్థానాలు సాధించారు. బాలురలో అండర్‌-8లో ఎన్‌.సాయివిభు, ఆర్‌.తేజవజ్రాక్ష్‌, అరవా సోలంకి, అండర్‌-10లో ఎ. శశాంక్‌, ఎస్‌ఎ్‌సకే. నిహాల్‌ వర్మ, కె.సందీప్‌ కుమార్‌, అండర్‌-12లో ఎన్‌.ప్రీతమ్‌ దర్శన్‌, షేక్‌ అర్షద్‌బాబా, మందుల బాబు శ్యామ్యూల్‌, అండర్‌-14లో పి.దుర్గాప్రసాద్‌, బి.భాను ప్రకాష్‌, సిహెచ్‌.షణ్ముక నాగసాయి, అండర్‌-16లో జె.ధనరాజ్‌, ఎస్‌సీ సునీల్‌కుమార్‌రెడ్డి, పి.స్వరంకిత్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

Updated Date - 2022-11-21T01:14:28+05:30 IST

Read more