-
-
Home » Andhra Pradesh » Krishna » completed summer coaching classes-NGTS-AndhraPradesh
-
ముగిసిన వేసవి శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2022-07-05T06:19:29+05:30 IST
వేసవి శిక్షణ తరగతులు పోటీలకు పునాదులని ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ కార్యదర్శి కె.ఎల్.వి మోహనరావు అన్నారు

ముగిసిన వేసవి శిక్షణ తరగతులు
వన్‌టౌన్, జూలై 4: వేసవి శిక్షణ తరగతులు పోటీలకు పునాదులని ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ కార్యదర్శి కె.ఎల్.వి మోహనరావు అన్నారు. మే1వ తేదీ నుంచి పాఠశాలలో ప్రారంభమైన బాక్సింగ్, రెజ్లింగ్ వేసవి శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రథమంగా తమ పాఠశాల నుంచి బి.సాయినీహారిక జాతీయ రెజ్లింగ్ పోటీలకు రాష్ట్ర జట్టకు తొలి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పథకాలు సాధించిన బి.సాయి నీహారిక, బి.పుష్ప, జి.మోనికా, జి.వేవేంద్రలకు, బాక్సింగ్‌లో పతకాలు సాధించిన వి.వాలి కేతన్రాజు, సి.హెచ్ జాహ్నవిలకు క్రీడా ప్రతిభా పురస్కారాలను మోహనరావు అందచేశారు. బాక్సింగ్ కోచ్ కె.మోజేష్‌ను సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఇచ్చిన క్రీడా సామాగ్రిని, సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.వి సత్యప్రసాద్,ఎస్.లక్ష్మి, ఎన్సీసీ అధికారి బి.బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు.