పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-08-04T06:21:21+05:30 IST

వెహికల్‌ డిపోలో చేపట్టిన ఆధునికీకరణ పనులను వేగవంతం చేసి, సత్వరమే పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

పనులను వేగవంతం చేయండి

పనులను వేగవంతం చేయండి

 నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

పూర్ణానందంపేట, ఆగస్టు 3: వెహికల్‌ డిపోలో చేపట్టిన ఆధునికీకరణ పనులను వేగవంతం చేసి, సత్వరమే పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక పూర్ణానం దంపేటలోని వెహికల్‌ డిపోను బుధవారం ఆయన తనిఖీ చేసి డిపోలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిం చారు. డిపోలో నూతనంగా నిర్మించిన మెకానికల్‌ షెడ్‌లో ఫ్లోరింగ్‌ పనులు చేపట్టాలని, వాహనాలు సర్వీసింగ్‌ చేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సర్వీస్‌ పాయింట్‌ వద్ద డస్ట్‌బిన్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌, నాళమ్యాన్‌ వాహనాలను క్షేత్రస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచిం చారు. వెహికల్‌ డిపో ప్రహరీకి పెయింటింగ్‌ వేయాలని చెప్పారు. డిపో ప్రధాన ద్వారం వద్ద ఏ విధమైన వాహనాలు పార్కింగ్‌ చేయకుండా చూడాలని సూచించారు. అనంతరం ఏలూరు కాల్వ వెంబడి ఉన్న గోరా పార్కు ను సందర్శించి పార్కు స్థితిగతులు, నిర్వహణ తీరును పరిశీలించారు.  సూపరింటెండెంట్‌ ఇంజ నీర్‌ (వర్క్స్‌) పీవీకే భాస్కర్‌, స్టోర్స్‌ ఇన్‌చార్జ్‌ యోగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:21:21+05:30 IST