గాంధీహిల్‌పై పనులను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2022-08-09T06:16:40+05:30 IST

గాంధీహిల్‌పై పనులను వేగ వంతం చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆదేశించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పుర స్కరించుకుని నిర్వహిం చనున్న హెరిటేజ్‌ వాక్‌కు సంబంధించిన పనులను ఆయ న పరిశీలించారు,

గాంధీహిల్‌పై పనులను వేగవంతం చేయండి
గాంధీహిల్‌పై పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

గాంధీహిల్‌పై పనులను వేగవంతం చేయండి 

 కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ 

వన్‌టౌన్‌, ఆగస్టు 8: గాంధీహిల్‌పై పనులను వేగ వంతం చేయాలని  నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆదేశించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పుర స్కరించుకుని నిర్వహిం చనున్న హెరిటేజ్‌ వాక్‌కు సంబంధించిన పనులను ఆయ న పరిశీలించారు, పెయిం టింగ్‌, ఫొటో ప్రదర్శన, ప్రహరీ, కొండపైకి వెళ్లే దారిలో ఉన్న గోడలో ఖాళీల్లో మరమ్మతులు తదితరాలను గురించి తగు సూచనలు చేశారు. స్థూపం వద్దకు వెళ్లే మెట్ల మార్గంలో ప్యాచ్‌వర్కు, పెయింటింగ్‌, మొక్కలు నాటడం, శిలాఫలకాల దిమ్మెలకు పెయింటింగ్‌, విద్యారుఽ్థలకు మౌలిక సదుపాయాలు, టాయిలెట్ల మరమ్మతులు ఇలా పలు అంశాలకు సంబంధించిన పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ మేరకు సత్వరమే పనులు చేయించాలని సూచించారు. అనంతరం ఆయన ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై పరిశీలన చేసి తగు ఆదేశాలు ఇచ్చారు. వివిధ విభాగాల అధికారులు కేవీ సత్యవతి, ఎం.ప్రభాకరరావు, పీవీకే భాస్కర్‌, జుబిన్‌ శిరన్‌రాయ్‌, డాక్టర్‌ సీహెచ్‌ బాబూ శ్రీనివాసన్‌, ఏఎస్‌ఎన్‌ ప్రసాద్‌, వి. శ్రీనివాస్‌, సురేష్‌, రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:16:40+05:30 IST