రైతులకు న్యాయం చేస్తాం

ABN , First Publish Date - 2022-12-13T23:54:48+05:30 IST

రైతులకు న్యాయం చేస్తాం

రైతులకు న్యాయం చేస్తాం

ముంపు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌ పర్యటన

మురుగు పారుదల పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశం

మోపిదేవి, డిసెంబరు 13 : తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా నీటి ముంపునకు గురై పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకూ ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమే్‌షబాబు తెలిపారు. మంగళవారం మోపిదేవి మండలంలోని పెదప్రోలు వద్ద నీటి ముంపునకు గురైన పంట పొలాలను వారు పరిశీలించారు. ముంపునకు కారణాలను రైతులు కలెక్టర్‌కు వివరించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జరిగిన పనుల వల్ల డ్రెయినేజీ పూడుకుపోయిందని, శాశ్వత ప్రాతిపదికన డ్రెయినేజీ పూడికతీత పనులు చేపట్టినట్లైతే నీరు నిల్వ లేకుండా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్క రైతుకూ తక్షణమే మినుము విత్తనాలు అందించి, పంట నష్టం అంచనా వేగవంతంగా జరిగేలా చూడాల్సిందిగా అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఆయనతోపాటు మచిలీపట్నం ఆర్డీవో ఐ.కిషోర్‌, పెదప్రోలు గ్రామసర్పంచ్‌ పోలిమెట్ల ఏసుబాబు, తహసీల్దార్‌ నవీన్‌ కుమార్‌ ఉన్నారు.

చల్లపల్లి : మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకోవాలనీ, వెంటనే పూడికతీత పనులు చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పాతమాజేరు వచ్చిన కలెక్టర్‌ పూషడం రోడ్డులో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మురుగునీటి పారుదలకు తీసుకోవాల్సిన చర్యలపై డ్రెయినేజీ శాఖ అధికారులతో చర్చించి పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. పంటనష్టం అంచనాలు వేయాలని అధికారులకు సూచించారు. 300 క్వింటాళ్ల మినుము విత్తనాలం అవసరం అవుతాయని ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఏవో జి.సాయిసింధు కలెక్టర్‌కు తెలిపారు. చల్లపల్లి మండలంలో పంటనష్టం వివరాలను తహసీల్దార్‌ కె.గోపాలకృష్ణ కలెక్టర్‌కు తెలిపారు.

పదిశాతం కూడా పనులు చేయలేదు

ప్రకృతి కొంత నష్టం చేస్తే, డ్రెయినేజీ పనుల్లో అలసత్వం కారణంగా మరింత ఎక్కువ నష్టం జరిగిందని రైతునేత పరిశె చలపతిరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో డ్రెయిన్లు, ఇరిగేషను కాలువల మరమ్మత్తులు ఒకరికే కాంట్రాక్ట్‌ ఇచ్చారనీ, ఆయనకు ఏయే మురుగు కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదనీ, ఇప్పటివరకూ పదిశాతం పనులు కూడా చేయలేదని తెలిపారు. కాంట్రాక్టర్‌ ఎవరని డ్రెయినేజీ అధికారులను ప్రశ్నించిన కలెక్టర్‌ సమస్య తనకు అర్థమైందన్నారు. యంత్రాల వినియోగంతోపాటు కూలీలను కూడా ఏర్పాట ుచేసి పనులు వేగవంతంగా చేయాలని డ్రెయినేజీ శాఖ ఏఈ రాంకుమార్‌ను ఆదేశించారు.

Updated Date - 2022-12-13T23:54:50+05:30 IST