AP News: ఏపీ మంత్రులపై ఎమ్మెల్యే చింతమనేని హాట్‌ కామెంట్స్‌

ABN , First Publish Date - 2022-08-09T16:55:40+05:30 IST

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఏపీ మంత్రులపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

AP News: ఏపీ మంత్రులపై ఎమ్మెల్యే చింతమనేని హాట్‌ కామెంట్స్‌

కృష్ణా (Krishna) జిల్లా: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar) ఏపీ మంత్రులపై హాట్‌ కామెంట్స్‌ (Hot Comments) చేశారు. మంత్రి పదవులు వెంట్రుక  పీకడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. తమలా స్వతంత్రంగా మాట్లాడే దమ్ము మంత్రులకు లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna reddy) స్క్రిప్ట్‌‌కు మంత్రులు రిహార్సల్స్ చేస్తారని విమర్శించారు. అంతేకాదు మంత్రులకు జగన్ (Jagan) భజన తప్ప మరేమీ తెలియదని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాక్షేత్రంలో ఎక్కడా కనిపించరని, దళితులకు పదవులిచ్చి..పెత్తనం మాత్రం వేరేవారు చేస్తున్నారని ఆరోపించారు. దళితులను చిన్నచూపు చూడడం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంత రాక్షసపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని, చూడబోమని చింతమనేని అన్నారు.


వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై చింతమనేని తనదైన శైలిలో స్పందించారు. ఎంపీ చేసిన ఘనకార్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వేరేవాళ్లపై నెట్టేస్తూ.. పోలీస్ బుద్ధి చూపిస్తున్నారని మండిపడ్డారు. నిజాలను దాచడం ఎవరివల్ల కాదన్నారు. గోరంట్ల ఏపీసోడ్‌పై రాష్ట్ర హోంమంత్రి స్పందించక పోవడాన్ని చింతమనేని తప్పుపట్టారు. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, తిప్పనగుంట గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చింతమనేని ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-08-09T16:55:40+05:30 IST