బాల్య వివాహాలు అనర్థదాయకం, చట్టవిరుద్ధం

ABN , First Publish Date - 2022-10-17T06:53:49+05:30 IST

బాల్య వివాహాలు అనర్థదాయకం, చట్ట విరుద్ధమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి ఎ.పద్మ, డీఎస్పీ మాసుంబాషా, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ సువర్ణ పేర్కొన్నారు.

బాల్య వివాహాలు అనర్థదాయకం, చట్టవిరుద్ధం

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 16 : బాల్య వివాహాలు అనర్థదాయకం, చట్ట విరుద్ధమని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి ఎ.పద్మ, డీఎస్పీ మాసుంబాషా, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ సువర్ణ పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో వారు పాల్గొన్నారు.  ప్రాజెక్టు డైరెక్టర్‌ సువర్ణ మాట్లాడుతూ, బాల్య వివాహాలు అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం తె చ్చేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, బెరాకా మినిస్ర్టీ్‌సను భాగస్వామ్యం చేశామన్నారు.  ర్యాలీలో మహిళా శిశు సం క్షేమ శాఖాధికారి సాల్మన్‌, సీఐలు కొండయ్య, శ్రీధర్‌కుమార్‌, ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ: బాల్యవివాహాలు చేయడం చట్టవిరుద్దమని, వాటిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉం దని ఒన్‌టౌన్‌ సీఐ కె.గోవిందరాజులు అన్నా రు. బాల్య వివాహాలను నిరోధించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ నెహ్రుచౌక్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్సైలు గౌతమ్‌కుమార్‌, రాజేంద్రప్రసాద్‌, మురళీకృష్ణ, పోలీసులు, విద్యార్ధులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-10-17T06:53:49+05:30 IST