వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-19T01:04:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది?: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది?: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది? అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రైతులు దెబ్బతిన్నారు, యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. టీడీపీ హయాంలో టెక్నాలజీ రంగాన్ని డెవలప్‌చేశానని తెలిపారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తానన్నారు. ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయికి ఎదిగే శక్తి ఏపీ యువతకు ఉందన్నారు. మద్యం ధరలు ఇష్టానుసారం పెంచడంతో ప్రజలు సారా, గంజాయి వైపు మళ్లారని మండిపడ్డారు. డబ్బు కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జే-బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పారు. వైఎస్ కుటుంబం వందల ఎకరాలు కొట్టేశారుని ఆరోపించారు. ఊరికో సైకోను తయారు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. 

Read more