వ్యాపారులకు అండగా ఉంటా
ABN , First Publish Date - 2022-07-06T06:58:11+05:30 IST
వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్ అన్నారు.

చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్
మచిలీపట్నం టౌన్ : వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ జ్యూయలరీ డైమండ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన మద్దుల గిరీ్షను, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అకౌంటెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉడత్తు శ్రీనివాసరావుల మంగళవారం మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. మద్దుల గిరీష్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి వ్యాపారులు సంఘటితంగా పోరాడదామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రఽధాన కార్యదర్శి పల్లపోతు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి జల్లూరి గోపీ, కోశాధికారి మాల్యాద్రి, మెడికల్ షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయగిరి సురేష్, అంజిబాబు, యెండూరి సురేష్, దింటకుర్తి శ్రీనివాస్, పి.నారాయణ, జల్లూరి మురళి, దేసు సుబ్రహ్మణ్యం, అనిల్, నంబూరి నాగేంద్ర గుప్త, ఫిరోజ్, ఉదయగిరి మురళి, గుప్తా, ఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.