వేడుకగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ABN , First Publish Date - 2022-10-02T05:47:03+05:30 IST

పటమట సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం పటమట సంస్థ కార్యాలయంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్యదేవర పాపారావు అధ్యక్షతన ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు.

వేడుకగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం
సీనియర్‌ సిటిజన్లను సత్కరిస్తున్న కార్యవర్గ సభ్యులు

వేడుకగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం 

పటమట, అక్టోబరు 1 : పటమట సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం పటమట సంస్థ కార్యాలయంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్యదేవర పాపారావు అధ్యక్షతన ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు. లా కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.దివాకర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ సభ్యులు ముక్కామల మోహన్‌రావు, ఎం.వెంకటేశ్వరరావు, కారంపూడి జ్ఞాని సత్యనారాయణ, గుండపనేని రామమోహన్‌రావు, కంచర్ల వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు వి. వెంకటేశ్వరరావు, పి. సాంబశివరావు, కె.మాధవరావు, ఎన్‌డీ. మల్లిఖార్జునరావు, వి. సాంబశివరావు, సిహెచ్‌. భాస్కరరావు, లోయ నాగేశ్వరరావులు పాల్గొన్నారు. 

పాయకాపురం:  62వ డివిజన్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ హైస్కూల్‌లో శనివారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా పలువురు  వృద్ధులకు ఆహార పదార్థాలు, పండ్లు పంపిణీ చేసి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా  జిల్లా సైన్స్‌ అధికారి మైనం హుస్సేన్‌  మాట్లాడుతూ వృద్ధుల అనుభవాలు నేటి యువతకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. Read more