హాల్ మార్కింగ్ బంగారానికి బీమా సౌకర్యం కల్పించాలి
ABN , First Publish Date - 2022-10-17T06:50:09+05:30 IST
వ్యాపారులు హాల్ మార్కింగ్ చేయించుకునే బంగారానికి బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్ డిమాండ్ చేశారు.
బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయకుమార్
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 16 : వ్యాపారులు హాల్ మార్కింగ్ చేయించుకునే బంగారానికి బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్ డిమాండ్ చేశారు. మచిలీపట్నం బులియన్, జ్యూయలరీ, డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ వజ్రోత్సవం ఆదివారం గోల్డ్ కన్వెన్షన్ హాలులో జరిగింది. కపిలవాయి విజయకుమార్ ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. కోట్లాది రూపాయల విలువ గల బంగారానికి వ్యాపారులు హాల్ మార్కింగ్ చేయించుకుంటున్నారన్నారు. ఏజెన్సీలు ఏ విధమైన అవకతవకలకు పాల్పడినా వ్యాపారులు నష్టపోయే ప్రమా దం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాల్ మార్కింగ్ చే యించుకునే బంగారానికి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మచిలీపట్నం సంఘ అధ్యక్షుడు తమ్మన గిరీష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో నేతలు ముజాహెద్ హుస్సేన్, తాడంకి దుర్గాప్రసాదరావు, వై. శ్రీనివాసకుమార్, ఉడత్తు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్‌దాదా తదితరులు పాల్గొన్నారు. మద్దుల గిరీ్‌షను యెండూరి సురేష్ తదితరులు ఘనంగా సత్కరించారు. వజ్రోత్సవం సందర్భంగా అసోసియేషన్ డైరీని నేతలు ఆవిష్కరించారు.