సమాజంలో గురువు స్థానం పదిలం
ABN , First Publish Date - 2022-10-07T06:07:44+05:30 IST
గూగుల్, ఇంటర్‌నెట్ సౌకర్యాలెన్ని ఉన్నా ఒక ఉపాధ్యాయుడిగా గురువుల స్థానం మాత్రం పదిలంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
పటమట, అక్టోబరు 6 : గూగుల్, ఇంటర్‌నెట్ సౌకర్యాలెన్ని ఉన్నా ఒక ఉపాధ్యాయుడిగా గురువుల స్థానం మాత్రం పదిలంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కంకిపాడుకు చెందిన విద్యార్థి వికాసం వాహిని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఉపాధ్యాయుఽల దినోత్సవం బెంజిసర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంధాలయ భవన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిష్ణాతులైన 8మంది ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి లోకాన్ని సమాజానికి శాస్త్రవేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలుగా అందించిన ఘనత ఒక ఉపాధ్యాయుడిదేనన్నారు. సభాధ్యక్షుడు వేములపల్లి కేశవరావు ఉపాధ్యాయుల దినోత్సవ విశిష్టతను వివరించారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రావి శారద, వికాస దర్శిని సంస్థ కార్యదర్శి కె. లక్ష్మణరావు, శ్రావణ్ పాల్గొన్నారు.