వాహనాలను వినియోగంలోకి తీసుకురండి

ABN , First Publish Date - 2022-12-07T00:32:16+05:30 IST

నూతనంగా కొనుగోలు చేసి డిపోలో ఉన్న నాలుగు వాహనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు.

వాహనాలను వినియోగంలోకి తీసుకురండి

వాహనాలను వినియోగంలోకి తీసుకురండి

ఫనగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

పూర్ణానందంపేట, డిసెంబరు 6 : నూతనంగా కొనుగోలు చేసి డిపోలో ఉన్న నాలుగు వాహనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక పూర్ణానందంపేటలో ఉన్న వెహికల్‌ డిపోను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంలో నూతనంగా కొనుగోలు చేసిన నాలుగు టాటా 407జి ఎస్‌ఎఫ్‌సీ సీఎన్‌జీ టిప్పర్‌ వాహనాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. డిపో ఆవరణలో చేపడుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మెకానికల్‌ షెడ్‌లో ఫ్లోరింగ్‌ పనులు చేపట్టాలని సూచనలు చేశారు. డిపో ప్రధాన ద్వారం వద్ద వాహనాలు పార్కింగ్‌ చేయకుండా చూడాలని ఆదేశించారు. వెహికల్‌ డిపో డీఈ ప్రవీణ్‌ చంద్ర, ఏఈ యేసుపాదం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:32:18+05:30 IST