కట్లేరుపై రాకపోకలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-10-08T05:58:05+05:30 IST

అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోటమూల - వినగడప రహదారిలోని కట్లేరు బ్రిడ్జ్‌పై వరద భారీగా ప్రవహించడంతో శుక్రవారం రాకపోకలు నిలిచిపోయాయి.

కట్లేరుపై రాకపోకలకు బ్రేక్‌
వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, తదితరులు

గంపలగూడెం, అక్టోబరు 7: అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోటమూల - వినగడప రహదారిలోని  కట్లేరు బ్రిడ్జ్‌పై వరద భారీగా ప్రవహించడంతో శుక్రవారం  రాకపోకలు నిలిచిపోయాయి. కట్లేరు బ్రిడ్జ్‌ 2018 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోగా బ్రిడ్జ్‌కి సంబంధించి కేవలం నాలుగు ఖానాలపైన మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరద కారణంగా ఆ ఖానాలు కూడా కొంత మేర కుంగిపోయి, పక్కన ఉన్న గోడ కొట్టుకుపోయింది. దీంతో దానిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జ్‌ వద్ద పరిస్థితిని తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి, ఎస్సై వి.సతీష్‌ పరిశీలించారు.  

Read more