పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-12T00:36:24+05:30 IST

చిట్టినగర్‌లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి.

పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

లక్ష పసుపు కొమ్ములతో

మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అలంకారం

చిట్టినగర్‌, నవంబరు 11: చిట్టినగర్‌లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం అమ్మవారిని లక్ష పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో లక్ష కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి పలువురు భక్తులు సారెను సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు పలువురు సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2022-11-12T00:36:24+05:30 IST

Read more