నీటి పథకం పనులు సక్రమంగా చేయాలి

ABN , First Publish Date - 2022-09-11T06:27:16+05:30 IST

ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని సీనియర్‌ టీడీపీ నేత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు.

నీటి పథకం పనులు సక్రమంగా చేయాలి

పెడన, సెప్టెంబరు 10 : ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సమగ్ర మంచినీటి పథకం నిర్మాణ పనులు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని సీనియర్‌ టీడీపీ నేత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. మన పట్టణ అభివృద్ధి కోసం పేరిట శనివారం ఆయన స్థానిక దేవాంగ కళ్యాణ మండపంలో పురప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  పురప్రముఖులు, ప్రజాప్రతినిధుల సహకారంతో 2006 నుంచి స్కీమ్‌ కోసం విశేష కృషి జరిపామన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన ఈ పథకాన్ని అప్పటి ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు శంకుస్థాపన చేయగా, మళ్లీ ఇప్పు డు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. తాగునీటి పథకం నిర్మాణ పనులు అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూ చించారు. ఎండి మతీన్‌, రహమాన్‌ బేగ్‌, కట్టా హేమసుందరమూర్తి, చందన నా రాయణరావు, బళ్ళ కోటమల్లయ్య, వహబ్‌ఖాన్‌, బూసం ఆనందరావు, యర్రా నాగరాజు, బళ్ళ మల్లిఖార్జున ప్రసాద్‌, దాసరి శివనాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-11T06:27:16+05:30 IST