బీమా పేరిట రూ.కోట్లు దోచారు

ABN , First Publish Date - 2022-06-25T06:10:56+05:30 IST

బీమా పేరిట రూ.కోట్లు దోచారు

బీమా పేరిట రూ.కోట్లు దోచారు
మాట్లాడుతున్న దేవినేని ఉమా, బోడె ప్రసాద్‌

పెనమలూరు, జూన్‌ 24: పంట బీమా పథకంలో నిజమైన రైతులకు రూపాయి లబ్ధి చేకూరలేదని, వైసీపీ నేతలు తప్పుడు లెక్కలతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా  మాట్లాడుతూ సీఎం జగన్‌ చేపడుతున్న ప్రజా వ్యతిరేకపాలనను తిప్పికొట్టడానికి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేపడుతున్నామన్నారు. వైసీపీ అక్రమాలకు చెక్‌ పెట్టడానికి ఈ నెల 29న గుడివాడలో మినీ మహానాడును నిర్వహి స్తున్నామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, ఒకచాన్స్‌ అంటూ అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలను దూరం చేశారని, యువత విదేశాలలో ఉన్నత విద్యానభ్యసించడం కోసం టీడీపీ అందించిన ఆర్ధిక చేయూతను రద్దు చేశారన్నారు. 

Updated Date - 2022-06-25T06:10:56+05:30 IST