27న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు

ABN , First Publish Date - 2022-11-25T00:58:57+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 27న ఆదివారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రోగ్రాం ఇంచార్జి సీవీకే ప్రసాద్‌ తెలిపారు.

27న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు

లబ్బీపేట, నవంబరు 24 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 27న ఆదివారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రోగ్రాం ఇంచార్జి సీవీకే ప్రసాద్‌ తెలిపారు. గురువారం నగరంలోని సంస్థ కార్యాలయంలో భగవద్గీత పోటీల పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 27వ తేదీ ఉదయం 9.30గంటలకు తి.తి.దే కళ్యాణ మండపంలో పోటీలు జరుగుతాయని, భగవద్గీతలోని నాలుగవ ఆధ్యాయం జ్ఞాన యోగంలోని 42 శ్లోకాలపై ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు ఒక విభాగం, 8, 9 తరగతులకు మరో విభాగంలో పోటీలు నిర్వహస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో సంపూర్ణ భగవద్గీత-18 అధ్యాయాలు నేర్చుకున్న 18 సంవత్సరాల లోపు వారికి ఒక విభాగంగా, 18సంవత్సరాల పైబడిన వారికి మరో విభాగం పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాలుగు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారని, ప్రథమస్థానంలో నిలిచిన వారికి తిరుపతిలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన వారు ఫోన్‌ నెంబర్‌ 7032255499లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆర్గనైజర్‌ కె.రామాంజనేయులు రెడ్డి, ధర్మ ప్రచారమండలి సభ్యులు బాల కోటేశ్వరరావు, విశ్వ ధర్మపరిషత్‌ సభ్యులు శేష ప్రసాద్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:58:57+05:30 IST

Read more