బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యాత్ర
ABN , First Publish Date - 2022-10-07T06:09:00+05:30 IST
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యా త్ర చేపడుతున్నామని, బీసీలు సంఘటితం కావాలని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు.
బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన
వన్‌టౌన్, అక్టోబరు 6 : బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా త్వరలో బస్సు యా త్ర చేపడుతున్నామని, బీసీలు సంఘటితం కావాలని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నగరంలోని టిక్కిల్‌రోడ్డులో గల ఒక ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగింది. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన పార్టీలు విస్మరిస్తున్నాయన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచితస్థానం ఇవ్వాలన్నారు. రాజధానిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, బస్సు యాత్రను నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి ఉమామహేశ్వరరావు,, నేతలు అన్నవరపు మల్లేశ్వరరావు, మల్కాపురం కనకారావు కాకుమాను మల్లిఖార్జునయాదవ్, చిప్పాడ చందు, పలగాని సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.