బీసీలకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-12-07T00:49:51+05:30 IST
రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావా లని గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు డు, టీడీపీ బీసీ సెల్ జిల్లా నాయకులు శొంఠి శివరామ ప్రసాద్ అన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటూ స్థానిక తహసీ ల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిర సన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కంకిపాడు, డిసెంబరు 6 : రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావా లని గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షు డు, టీడీపీ బీసీ సెల్ జిల్లా నాయకులు శొంఠి శివరామ ప్రసాద్ అన్నారు. బీసీలకు న్యాయం చేయాలంటూ స్థానిక తహసీ ల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిర సన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనం తరం తహసీల్దార్ టి.వి.సతీష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివరామ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్లు ఉన్నా ప్రయోజనం సున్నా అన్నారు. ఒక్క కార్పొ రేషన్‌కు అయినా నిధులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జయహో బీసీ అంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ బీసీ నాయకులు మాదు శోభన్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లుక్కా అరుణ్ కుమార్, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొండవీటి శివయ్య, పులి శ్రీనివాసరావు, బొర్రా వెంకట్, వణుకూరు విక్రం, శివపార్వతి, పావని, పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.