క్షమించు బాపు..

ABN , First Publish Date - 2022-10-03T05:59:14+05:30 IST

క్షమించు బాపు..

క్షమించు బాపు..

పాయకాపురం, అక్టోబరు 2 : స్వాతంత్య్రం కోసం, జాతి శ్రేయస్సు కోసం అహింసే మార్గంగా ఉద్యమించిన మహాత్మాగాంధీ కన్న కలలు ఇవేనా? ఆయన్ను అనుసరించి సన్మార్గంలో నడుచుకోవడం అంటే ఇదేనా? జాతిపిత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ప్రభుత్వాలకు ఈ పేదల బతుకులు కనిపించవా? మహాత్ముడే బతికుంటే ఈ పరిస్థితిని హర్షిస్తాడా? ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివస్తున్నారని తెలుసుకున్న చిన్నారులు స్థానిక రథం సెంటర్‌, ప్రసాదాల కౌంటర్‌, దుర్గాఘాట్‌, వినాయకుడి గుడి, మెయిన్‌ రోడ్లపై ఆదివారం ఇలా గాంధీజీ వేషధారణలో భిక్షాటన చేశారు. తరాలు మారినా, తమ తలరాతలు మారలేదని, ప్రభుత్వాలు, పాలకులు మారినా చితికిన తమ బతుకులు బాగుపడలేదని మౌనంగానే భిక్షను అర్థించారు. అహింసతో స్వాతంత్ర్యాన్ని తెచ్చిన ఓ బాపూ.. నీ రూపంతో జరుగుతున్న ఈ వ్యాపారాన్ని ఇకనైనా ఆపు..Updated Date - 2022-10-03T05:59:14+05:30 IST