ఎట్టకేలకు బ్యానర్ల తొలగింపు

ABN , First Publish Date - 2022-03-05T06:15:13+05:30 IST

ఎట్టకేలకు బ్యానర్ల తొలగింపు

ఎట్టకేలకు బ్యానర్ల తొలగింపు
ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగిస్తున్న నగరపంచాయతీ సిబ్బంది

ఉయ్యూరు, మార్చి 4 : పట్టణ ప్రధాన రహదారి డివైడర్‌పై విద్యుత్‌ స్తంభా లకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు నగర పంచాయతీ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. కాటూరు రోడ్డుతో పాటు ప్రధాన రహ దారి డివైడర్‌పై విద్యుత్‌ స్తంభాలకు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు,  కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలు కిందికి వే లాడుతూ వాటికి ఉన్న ఎదురు  కర్రలు తగిలి వాహనాలపై వెళ్లేవారు ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. రహ దారిపై ఏవిధమైన అనుమతి లేకుండా కట్టిన బ్యానర్లు ప్రమాదాలకు కారణంగా ఉన్న వైనంపై నగర పంచాయతీ అధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. స్పందించిన అధికారులు శుక్రవారం తొలగింపు చర్యలు చేపట్టారు. 

Read more