టీడీపీతోనే మహిళలకు గుర్తింపు
ABN , First Publish Date - 2022-06-28T05:54:30+05:30 IST
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజీకీయంగా పదోన్నతులు కల్పించారని దానిని కొనసాగిస్తూ చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.

టీడీపీతోనే మహిళలకు గుర్తింపు
బాదుడే బాదుడులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
లబ్బీపేట, జూన్ 27: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రాజీకీయంగా పదోన్నతులు కల్పించారని దానిని కొనసాగిస్తూ చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. 19వ డివిజన్ పున్నమ్మతోట ఏరియాలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీతోనే మహిళలకు గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 2022 మే 28 నుంచి 2023 మే 28 వరకు శతజయంతి ఉత్సవాలను టీడీపీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మహిళలను ప్రతి సంక్షేమ పథకంలో హక్కుదారులను చేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి కొందరు మహిళలకు మాత్రమే రూ.10 వేలు, రూ.15 వేలు ఇచ్చి అందరి వద్ద ధరల రూపంలో దోచుకుంటున్నారన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డివిజన్లోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మైనార్టీ నాయకులు ఫీరోజ్, బాగం సాయిప్రసాద్ పాల్గొన్నారు.
రాణిగారితోట: 18వ డివిజన్లో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వేముల దుర్గారావు మాట్లాడుతూ డివిజన్లో ఏ రోడ్డు చూసినా పొంగి పొర్లే డ్రెయినేజీ వ్వవస్థతో, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు కూడా తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారన్నారు. ఈ డివిజన్లో డ్రెయినేజీ పైపులైన్ మార్చే ప్రక్రియ మూలన పడిందని, సంబంధిత పైపులు వచ్చి నెలలు గడుస్తున్నా పనులు ఒక్క అడుగు ముందుకు వెళ్లడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలతో కాకుండా పనులు పూర్తి చేసే దానిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పీరుబాబు, శ్రీను, ఆంజనేయులు, శ్రీకాంత్, రెడ్డి గురవయ్య, కరీముల్లా పాల్గొన్నారు.