-
-
Home » Andhra Pradesh » Krishna » baaaduday baadudu at 17th division ranigaritota-NGTS-AndhraPradesh
-
జగన్ పాలనలో విఠలాచార్య వింతలు
ABN , First Publish Date - 2022-07-05T06:06:34+05:30 IST
మన చిన్నతనంలో సినిమాల్లో చూసిన విఠలాచార్య వింతలు, చిత్రవిచిత్రాలు ఇప్పుడు జగన్ పాలనలో ఇంకా ఎక్కువగా చూస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.

జగన్ పాలనలో విఠలాచార్య వింతలు
రాణిగారితోట, జూలై4: మన చిన్నతనంలో సినిమాల్లో చూసిన విఠలాచార్య వింతలు, చిత్రవిచిత్రాలు ఇప్పుడు జగన్ పాలనలో ఇంకా ఎక్కువగా చూస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. సోమవారం ఆయన రాణిగారితోట 17వ డివిజన్‌లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని పెరిగిన ధరలపై ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజలను వైసీపీ వారు అమాయకులను చేసి, పిచ్చివారిగా పరిగణిస్తున్నారని, శిశుపాలుడు తప్పులు లాగా జగన్ పాపాలు కూడా ఒక్కొక్కటిగా పెరిగిపోతున్నాయన్నారు. దీనికి కచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని, తీర్పు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌కు చెందిన రిక్షా కార్మికులు ముత్యాల సురేష్, శ్రీనివాసులకు ప్లాట్‌ఫారమ్ రిక్షాలను అందజేశారు. విస్రం్త డానియేలు, వేముల దుర్గారావు, పీరుబాబు, ఆదిబాబు పాల్గొన్నారు.