రోడ్డు నిబంధనలపై ఆటోడ్రైవర్లకు అవగాహన

ABN , First Publish Date - 2022-07-01T06:36:07+05:30 IST

త్కూరు పీఎస్‌లో ఎస్సై సీహెచ్‌ కిషోర్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

రోడ్డు నిబంధనలపై ఆటోడ్రైవర్లకు అవగాహన

రోడ్డు నిబంధనలపై ఆటోడ్రైవర్లకు అవగాహన 

ఉంగుటూరు : ఆత్కూరు పీఎస్‌లో ఎస్సై సీహెచ్‌ కిషోర్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం ఆటోడ్రైవర్లకు అవగాహన  సదస్సు నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్‌ సీఐ సతీష్‌ మాట్లాడుతూ రోడ్డుప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనతో ఉండాల న్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపటం,  టేప్‌రికార్డులు, సౌండ్‌బాక్సులు ఏర్పాటు చేయరాదని, యూనిఫామ్‌, లైసెన్స్‌, వాహన అనుమతిపత్రాలు తప్పనిసరిగా వుండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 


Updated Date - 2022-07-01T06:36:07+05:30 IST