విజయవాడ సెక్స్‌ రాకెట్‌ వెనుక అవినాశ్‌

ABN , First Publish Date - 2022-11-26T00:55:40+05:30 IST

జయవాడను కుదిపేసిన సెక్స్‌ రాకెట్‌ వెనుక వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాశ్‌ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలను మించిపోవాలన్న అత్యాశతో అవినాశ్‌ అడ్డదారులు తొక్కుతున్నారని, ఆయన రక్షణ పొందుతున్నవారే బరి తెగించి ఇటువంటి రాకెట్లు నడుపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు.

విజయవాడ సెక్స్‌ రాకెట్‌ వెనుక అవినాశ్‌

వైసీపీ నేతలు సాయికుమారి, ఇర్ఫాన్‌లను రక్షిస్తున్నారు

సాయికుమారి కోసం పటమట పోలీసులకు అవినాశ్‌ ఫోన్లు: టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): విజయవాడను కుదిపేసిన సెక్స్‌ రాకెట్‌ వెనుక వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాశ్‌ ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలను మించిపోవాలన్న అత్యాశతో అవినాశ్‌ అడ్డదారులు తొక్కుతున్నారని, ఆయన రక్షణ పొందుతున్నవారే బరి తెగించి ఇటువంటి రాకెట్లు నడుపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అమాయక యువతులను లోబర్చుకుని వారి ద్వారా యువకులకు వల విసురుతున్నారు. వారు ఒక దగ్గర ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి లక్షలు గుం జుతున్నారు. ఈ వ్యవహారం బట్టబయలు అవడంతో ఈ రాకెట్‌లో చిక్కు కొన్న ఓ యువతి తండ్రి మనో వేదనతో ఆకస్మికంగా గుండెపోటుతో మర ణించాడు. ఈ రాకెట్‌ నడుపుతున్న వైసీపీ మహిళా నేత సాయికుమారి.. ఆమెకు తోడుగా ఉన్న వైసీపీ నేత ఇర్ఫాన్‌కు అవినాశ్‌ రక్షణ ఉంది. ఈ వ్యవహారం బయటకు రాగానే సాయికుమారి కోసం అవినాశ్‌ పటమట పోలీసులకు అనేకసార్లు ఫోన్లు చేసింది వాస్తవం కాదా? వీరంతా అవినాశ్‌ అనుచరులుగా ఉంటూ ఆయనతో కలిసి తిరుగుతున్న మాట వాస్తవం కాదా?’’ అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. అన్నీ కావాలన్న అంబటి రాం బాబును... గంటా అరగంట చాలని ఫోన్లు చేసిన అవంతి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి జగన్‌ మొదటే కట్టడి చేసి ఉంటే సెక్స్‌ రాకెట్లలో వైసీపీ నేతలు ఇంత బరి తెగించేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీ నేతలు నగరాన్ని గుట్కాలకు, గంజాయికి, వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మార్చి పరువు తీస్తున్నారని, మహిళల శరీరాలపై సం పాదనకు కూడా వెనకాడటం లేదని ఆయన విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపైకి తన అనుచరులను పంపించి దాడి చేయించడంతోపాటు, పట్టాభి ఇల్లు పగులగొట్టించినందుకు ముఖ్యమంత్రితో శభాష్‌ అని అనిపించుకొన్న నాటి నుంచి అవినాశ్‌ రెచ్చిపోతున్నాడని, నికృష్ట వ్యాపా రాలు చేసే వారిని అనుచరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదించే పనిలో పడ్డాడని మాణిక్యాలరావు ఆరోపించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజని అనుచరుడు సాంబయ్య పదకొండేళ్ల బాలికను లోబ ర్చుకుని, శారీరకంగా సంబంధం పెట్టుకొన్నాడని, మంత్రి ఒత్తిడితో ఆ వ్యక్తిని పోలీసులు వదిలేశారని మాణిక్యాలరావు ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇవ్వడానికి హడావుడి చేసే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ఇవన్నీ పట్టవా అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు

పటమట, నవంబరు 25: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు హత్యలకు, అత్యాచారా లకు గురవుతున్నారని అయినా వాటిపై హోం మంత్రి తానేటి వనిత స్పం దించడం లేదని, బాధ్యత మరచి వ్యవహరిస్తున్నారని తెలుగు మహిళ విజ యవాడ పార్లమెంట్‌ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, షేక్‌ ఆషా విమ ర్శించారు. యువతులకు కొందరు కిలాడీలు మాయమాటలు చెప్పి, కూల్‌ డ్రింక్స్‌, కొబ్బరిబొండాల్లో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చి, వారిన తప్పుడు మార్గాల్లో దించి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారని ఉషారాణి, షేక్‌ ఆషా ఆరోపించారు. మాయలేడి చేసిన దారుణాల వల్ల అమాయకురాలైన ఓ యువతి తండ్రిని కోల్పోయిందన్నారు. బాధిత కుటుం బానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి, వారికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆర్థికసాయం అందజేత

పటమట శివశంకర్‌నగర్‌లో గురువారం మృతి చెందిన లాషా రాంబాబు కుటుంబసభ్యులను చెన్నుపాటి ఉషారాణి, షేక్‌ ఆషా శుక్రవారం పరా మర్శించి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. మాదాల చిన్నతల్లి, శొంఠి సాయిలక్ష్మి, నూతి శ్రీను, గొర్ల గోవిందు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T00:55:41+05:30 IST